- ఆడిట్ చేస్తుంటే ఎత్తేస్తున్నారని ఆరోపణలు
- విషపు సమాజంలో బతుకుతున్నాం
- విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి
- అధికారులకు ఎపి సిఎం జగన్ సూచనలు
అమరావతి, డిసెంబర్ 27 : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు విపక్షాలు పింఛన్లపై దుష్పచ్రారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పెన్షన్లకు సంబంధించి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలని గుర్తు చేశారు. ఆడిట్ జరుగుతుంటే పింఛన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారని.. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ మాత్రమే చేస్తారన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు అందాలన్నదే లక్ష్యమని.. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే..
ఈ ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్దిదారుడు నష్ట పోకూడదన్న లక్ష్యమని.. రైతులు, పేదల కష్టాలు తమ ప్రభుత్వానికి తెలుసన్నారు. గతంలో అర్హత ఉన్నా పథకాల ద్వారా లబ్ది పొందని వారికి ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి డబ్బులు జమ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమేనని.. ఇప్పుడు నెలనెలా పింఛన్ బిల్లు రూ.1770 కోట్లు అన్నారు. గత ప్రభుత్వంలో రూ.వెయ్యి పింఛన్ ఇస్తే.. ఇప్పుడు రూ.2750కి పెంచామన్నారు. అందరం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం..వారిని దేవుడే శిక్షిస్తాడు అన్నారు. రాష్ట్రంలో అర్హత ఉండి సంక్షేమ పథకాలు దక్కనివారికి కూడా అవకాశం ఇస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. అసలు లంచాలు, వివక్షకు తావు లేకుండా పథకాలు అందిస్తున్నామన్నారు.
ఈ మూడున్నరేళ్లలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశామని తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి దాదాపు రూ.3.30 లక్షల కోట్లు అందించామని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పథకాల ఇచ్చేందుకు వసూళ్లు చేశాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వచ్చే ఆరోపణలను పాజిటివ్‌గా తీసుకుంటామని జగన్ అన్నారు. ఒకవేళ ఆరోపణల్లో నిజం ఉంటే సరిచేసుకుంటామన్నారు. కలెక్టర్లు బాగా పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నారు. ఈ ప్రభుత్వం ఏ మంచిపని చేసినా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే ప్రెస్ట్ పెట్టి మరీ వాళ్ల తప్పు ఎత్తి చూపాలన్నారు. ఒకవేళ తప్పు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. అలా చేయకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళుతుందని.. ’మనం ప్రజా సేవకులం’ అని సీఎం జగన్ అన్నారు. వివిధ పథకాల కింద లబ్దిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ మేరకు 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్ పద్ధతిలో సిఎం జగన్ జమ చేశారు. వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన అర్హులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఏటా జూన్, డిసెంబర్ నెలలో పెండింగ్ దరఖాస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కొన్ని డియా సంస్థలపై ధ్వజమెత్తారు. తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. ఏ ఒక్క లబ్దిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని సిఎం అన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందనివారికి అవకాశం ఇచ్చామన్నారు. పలు సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధులు జమ చేస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లంచాలకు,వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సిఎం జగన్ తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర చాలా కీలకమని, గత ప్రభుత్వంలో ఏ పార్టీ అని అడిగి పథకాలు ఇచ్చేవారని చెప్పారు. లంచాలు లేకుండా గత ప్రభుత్వం ఏ పథకం ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని సిఎం జగన్ ధ్వజమెత్తారు.




