ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28; వంద రూపాయల కైన్ పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు నటసార్వభౌముడిగా, ప్రజాదారణ పొందిన పరిపాలకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర బిజెపి ఓబీసీ విశ్వకర్మ సెల్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి, మేడ్చల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి మునిగంటి రాంప్రదీప్ అన్నారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్ బి కాలనీ నాలుగో డివిజన్ ఫేస్ వన్ చౌరస్తాలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి రాష్ట్ర బిజెపి ఓబీసీ విశ్వకర్మ సెల్ కన్వీనర్ పూసల బ్రహ్మచారి, మేడ్చల్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి మునిగంటి రాంప్రదీప్ నాయకత్వంలో బిజెపి నాయకులు టిడిపి సీనియర్ నాయకులు అమర్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రూపాయల కైన్ పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు నటసార్వభౌముడిగా మరియు ప్రజాదారణ పొందిన పరిపాలకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ బొమ్మ కలిగిన 100 రూపాయల కాయిన్ ను ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమరహే జై భారత్ మాత నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నాయకురాలు శశికళ సీనియర్ బిజెపి మహిళ నాయకురాలు ఉమారాణి బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు తాటిపల్లి లింగం సీనియర్ నాయకులు మురళి చారి రమణ సత్యనారాయణ బిజెపి డివిజన్ యూత్ నాయకులు దేవేందర్ టిడిపి నాయకులు అమర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



