పుస్తకం అంటే
మూడు అక్షరాలు కాదు!
త్రికాలాల గతిని మతికి తెలిపేది
పుస్తకం మనిషి మస్తకమే!
మది మదించిన విజ్ఞాన సాగరం!
పుస్తక పేజీలు చదవ
జీవిత రోజులు చాలవు!
పుస్తకాలు గురువు లాంటివే!
చదువరిని ఆలోచింపజేసీ
ఆచరింప జేస్తవి!
పుస్తకానికి మతిమరుపు ఉండదు
చదువరి మతిమరుపు పోగొడ్తవి
పుస్తకాలు ఒంటరి స్నేహితులు
మరో లోకం లో విహరింప జేస్తవి!
పుస్తకాలు సమ న్యాయం పాటిస్తవి!
ఎవరికి తగినవి వారికి సౌలభ్యమే!
పుస్తకాలు కాలానుగుణంగా
రూపం మార్చుకుంటవి!
తాళపత్ర గ్రంథాల నుండి
ఆధునిక ఇంటర్నెట్ వరకు
పుస్తకం ఆత్మ లాంటిదే
అది ఎపుడూ సజీవమే!
(బుక్ ఫెయిర్ సందర్భంగా)
– పి.బక్కారెడ్డి, 9705315250




