హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 14 : పుల్వామాలో అమరులు అయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధాంజలిని అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో….‘‘మనం ఇదే రోజున పుల్వామాలో కోల్పోయిన మన వీర నాయకులను స్మరించుకొంటున్నాం. మనం వారి సర్వోన్నత బలిదానాన్ని ఎన్నటికీ మరువబోము. వారి సాహసం ఒక బలమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి మనకు ప్రేరణను అందిస్తూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు




