‌పుతిన్‌కు ఉత్తర కొరియా అండ…

మాస్కో(రష్యా) , సెప్టెంబర్‌ 14  : ‌ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రధాన మలుపుగా ..రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా పాలకుడు కిమ్‌ ‌జోంగ్‌ ఉన్‌ ‌వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా యుద్దాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్‌ ‌దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ ‌సమర్థవ ంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది.
ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పుతిన్‌ ‌భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్‌తో కిమ్‌ ‌భేటీ అయ్యారు. రష్యా, ఉత్తర కొరియా డియా సంస్థల  కథనాల ప్రకారం.. సోవియట్‌ ‌కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్‌ ‌తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహ కారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావి ంచారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ అం‌శాన్ని కిమ్‌ ‌పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, రష్యా ష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అం శాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్‌తో చర్చించానని పుతిన్‌ ‌వెల్లడించారు.
కిమ్‌తో భేటీ అనంతరం ఆయన డియాతో మాట్లా డారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేం దుకు రష్యా సహకరిస్తుందా? అని డి యా ప్రశ్నిం చగా.. ‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్‌ ‌టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడే ందుకు ఇంకా చాలా సమయం ఉంది..‘అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తు న్నామ న్నారు.రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్‌ ‌పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్లను, రష్యా పసిఫిక్‌ ‌నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *