దులా దులా అస్సయ్ దులా
ముస్లిం బయ్యాల పీర్ల మేలా
దులా దులా అస్సయ్ దులా
సబ్బండవర్గాల పబ్బతి ఖేలా
దులా దులా అస్సయ్ దులా
తెలంగాణ సంబురాల హేలా
!!దులా దులా
చరణం:
ఎరుపు దస్తీ మెరుపు బస్తీ
పీర్ల సవ్వారికి సింగారించి
మల్లెపూలు దూదు పొగలు
డప్పు ధరువుల మోతలతో
ఉరేగించే ఉత్సవాల మేలా
చరణం:
కులం మరిచి మతం మరిచి
బాషా విడిచి యాస మరిచి
చేయి కలిపి పదం పల్లవించి
ఆలాయ్ బలాయ్ ఆచరించి
జాతి సమైక్యత చాటే మేలా
చరణం:
ఉపవాస దీక్షల పాటించి
నిప్పల కుంపటిపై నడిచి
కుడుక బెల్లం సమర్పించి
మొక్కు ముడుపు చెల్లించి
మోక్షం వరించుకునే మేలా
చరణం:
మర వీరులను స్మరించి
త్యాగ దనులను శ్లాఘించి
పీర్ల రూపుత్తిన దైవమూర్తిని
చల్లగా చూడమని వేడుకుని
సంబురంతో సాగనంపే మేలా
“””””””””
(జూలై 29 న మొహర్రం పండుగ సందర్భంగా…)
కోడిగూటి తిరుపతి
Mbl no:9573929493




