పి.సి.ఓ.ఎస్. తో కృంగిపోతున్న మహిళలు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ మహిళల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్న పి.సి.ఒ.ఎస్.
పి.సి.ఒ.ఎస్. పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్ మహిళల మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పి.సి.ఓ.ఎస్. మహిళలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పి.సి.ఒ.ఎస్. వల్ల మహిళల్లో అసమతుల్య హార్మోన్ల కారణంగా నెలసరి పీరియడ్స్ లలో ఇబ్బంది, గర్భధారణ కష్టతరం, అధిక బరువు, జుట్టు రాలడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దీనితో మహిళలు డిప్రెషన్, సోషల్ యాంగ్జయిటీ, ఓ.సి.డి. వంటి మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. మహిళలపై జరిపిన పరిశోధనలలో మూడ్ డిజార్డర్లను ఎదుర్కొనే ప్రమాదం మూడు రెట్లు అధికంగా ఉంటుందని రుజువు చేశాయి.
భాగస్వామి సహకారం లేనందున మహిళలుతమ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి సూటిపోటి మాటలతో ఆత్మన్యూనత భావానికి లోనవుతున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి నిరంతరం ఒత్తిడి పనిచేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నిరాశ నిస్పృహలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు ముఖ్యంగా భాగస్వామి సహకారం లేనందున మహిళలు మరింతగా కృంగిపోతున్నారు. మహిళల మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. శారీరక ఆరోగ్యం ఎంత ప్రధానమో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం.
మహిళలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి
1. పి.సి.ఒ.ఎస్. తో బాధపడుతున్న మహిళలు తమ లక్షణాలను పట్టించుకోవడం లేదు. పి.సి.ఒ.ఎస్. రోగంగా కాకుండా అదొక కండిషన్ గా మాత్రమే భావించండి.
2. మహిళలు కౌన్సిలింగ్ థెరపీ సెషన్లు తీసుకోవడానికి వెనుకడుగు వేయొద్దు. కౌన్సిలింగ్ మానసిక ధైర్యాన్ని మహిళల్లో పెంపొందిస్తాయి.
3. సైకాలజిస్ట్ సైకోథెరపిస్టుల సహాయాన్ని తీసుకుంటూనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేయాలి.
4. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రతిరోజు 6 నుండి 8 ఎన్ని గంటలు నిద్రపోవడం చేయాలి.
5. యోగా మెడిటేషన్ ప్రతి రోజు సాధన చేయాలి.
– డా.ఆట్ల శ్రీనివాస్ రెడ్డి, సైకాలజిస్ట్ ,కరీంనగ•




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల