పేగులు మెడలో వేసుకోవడం కాదు, పేదలకు హామీ ఇవ్వూ..
మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్లను ఓదార్చు
సిఎం రేవంత్‌రెడ్డిపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు
గజ్వేల్‌పై ఈర్ష్య పెట్టుకున్న కాంగ్రెస్, బిజెపిలకు వోటెందుకు వేయాలి?
కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించిన గజ్వేల్ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది
మీ కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకున్నా తక్కువే.. ఎందరో అనాథ బిడ్డల్ని అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి పివిఆర్
గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాజీమంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట / గజ్వేల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 02: పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరువు. మల్లన్నసాగర్ గేట్లు తెరిచి కూడవెళ్లి వాగుకు నీళ్లిస్తే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన రైతులు పంటలు పండిరచుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సూచించారు. రేవంత్‌రెడ్డీ…పేగులు మెడలో వేసుకోవడం కాదు…పేదలకు హామీ ఇవ్వాలనీ, మానవ బాంబు అవడం కాదు..మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్క్రెవర్లను ఓదార్చాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి సంబంధించి నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హరీష్‌రావు పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ…రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. 100రోజుల కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారని విమర్శించారు.
రైతులకు 2లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్‌కు వోటెయ్యండి, కాకపోతే కారుకు వేయండన్నారు. యాసంగి వడ్లకు, మక్కలకు 500రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వోట్లు అడుగుతుందని, దీనిపై ప్రతి ఊళ్లో పంచాయతీ పెట్టాలన్నారు. మహిళలకు ప్రతి నెలా 2,500రూపాయలులు డిసెంబర్ నెల నుండి ఇస్తానన్న మొట్ట మొదటి హామీని అమలు చేయకుండా మహా మోసం చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని మండిపడ్డారు. రెండు వందలు ఉన్న పెన్షన్‌ను రెండు వేలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని, నాలుగు వేల పెన్షన్ ఇస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి ఇంత వరకూ పెన్షన్ ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, నూతన వధువుకు తులం బంగారం, నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాయ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పి వోట్లు వేయించుకున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీకి ప్రజలే వోటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు.
పదేళ్ల బిజెపి పార్టీ పాలనలో రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. బిజెపి చెప్పేది వింటే జోడి లేకపోతే ఈడి అని, 2కోట్ల ఉద్యోగాల హామీ పేరుతో దేశంలోని నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ బిజెపి పార్టీ అన్నారు. పదేళ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను రెండిరతలు చేసి ఎన్నికల ముందు రెండు రూపాయలు తగ్గించిందన్నారు. కానీ, ఈ పదేళ్లలో తెలంగాణ రైతుల కోసం అహర్నిశలు పాటుపడి కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు నీళ్లు అందించిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనను రేపు ఎన్నికల రెఫరెండంగా చూపించి మనల్ని మోసం చేసే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌కు వోటు వేస్తే మోసపోతామన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, నాలుగు వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించరన్నారు.
మీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువే…
కేసీఆర్‌ను వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదనీ, మీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా తక్కువేనని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కార్యకర్తలందరూ ధ్కెర్యంగా ఉండాలని, భవిష్యత్ అంతా మనదేనని అన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. సమస్యలపైన, పరిపాలన మీద పట్టు ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డిని ఎంపిగా గెలిపించాలన్నారు. దుబ్బాకలో పనికి రాని రఘునందన్ ఇప్పుడు మెదక్ పార్లమెంట్‌కు పనికి వస్తాడా?అని ప్రశ్నించారు. 100 కోట్ల రూపాయలతో ట్రస్టును ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చిన మంచి మనసున్న మనిషి మన వెంకట్రామిరెడ్డి అని, ఎంతో మంది అనాథ బిడ్డల్ని అక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి, కలెక్టర్‌గా తన పాలన మార్కుతో ఎన్నో అవార్డుల్ని ఈ గడ్డకు తెచ్చిన వ్యక్తి, గజ్వేల్ గడ్డ మీద ఈర్ష్య పెట్టుకున్న ఈ కాంగ్రెస్, బిజెపి పార్టీలకు వోటు ఎందుకు వేయాలన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ బిడ్డల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ పార్టీకి వోటు అడిగే న్కెతిక హక్కు ఉందా?అని అడిగారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 15 రోజులకొకసారి కో-ఆపరేటివ్ డ్కెరీ ఫామ్ రైతులకు బిల్లులు వస్తుండేవనీ, కానీ నేడు 3 నెలలు దాటిపోయినా బిల్లులు రావడం లేదన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపి అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు మాజీమంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపి అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డిసి మాజీ ఛ్కెర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




