ఆ నవ్వులో
విచ్చుకున్న పారిజాతం
పసిపిల్లలా పరుగులా
ఉరికే జలపాతం.
క్రాగే బాధలో
కుంగే వేళలో
పలుకుల చిరుజల్లులా
మాటల పరవళ్లు.
గుర్తొస్తేజి
మనసొస్తేజి
కలం నాట్యానికి
కవితకు ప్రాణం.
చూపు సువాసన
స్రవించేకొద్ది
ధ్యాస ప్రత్యేక్షం.
రూపు పరోక్షం.
ఆ నవ్వుల సిరిని
మూట కట్టి
దాచుకున్నాను
మాల కట్టి ముడవాలని
నడిసిసిచ్చే రోజున
వేచి చూస్తూన్నాను
ఆ పువ్వలను
నీ దారి వెంట చల్లాలని.
-వసు




