పారదర్శకంగా డబల్ ఇండ్ల ఎంపిక

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 2:ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి . ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతగా 500 మందిని డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లు లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. దానిలో భాగంగా ఈ రోజు లబ్ధిదారులకు ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయంలో మంజూరు అయిన వారికి ప్రతాప్ సింగారం వరకు వెళ్ళడానికి బస్ లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయం వెళ్లి డబల్ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లలో ఎలాంటి అవకతవకలు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి దాదాపు 4752 ఇండ్లు మంజూరు కావడం జరిగింది అని తెలిపారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తున్న డబల్ ఇండ్లపై ప్రతిపక్షాలవి అర్థంలేని ఆరోపణలు అని తెలిపారు.
ఎవరు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించేందుకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు స్వంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మీ పథకం క్రింద మూడు లక్షలు అందిస్తుంది అని తెలిపారు.బల్దియా పరిధిలో అర్హులైన ప్రతి ఒక్క పేదలకు విడతాలవారిగా ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక ఇంటి నుంచి రెండు లేదా ఎక్కువ దరఖాస్తులు మరియు మరికొంత మంది సొంత ఇండ్లు ఉన్న దరఖాస్తు చేసుకోవడం జరిగింది అని తెలిపారు.విటన్నింటిని ర్యాoఢంగా ప్రక్షాళన చేయడం జరిగిందని తెలిపారు.నిజమైన అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు ఇప్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్,ఎల్.బి.నగర్ సర్కిల్ల డిప్యూటీ కమిషనర్లు దశరథ,రవీందర్ మరియు గడ్డిఅన్నారం డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,సీనియర్ నాయకులు మహేందర్ యాదవ్,బేర బాలకిషన్,ఆనంద్ గౌడ్,ఆశిష్,విక్కీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *