పాదాచార్లకు ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలు నిర్వహించాలి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలు నిర్వహించాలని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపేట రైతుబజార్ సర్వీస్ రోడ్డు నందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నవీన్ రెడ్డితో కలిసి విధి వ్యాపారం చేసుకునే వర్తకులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపారం చేసుకునే పనిలో బాగంగా రోడ్డు మీద పోయే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. మీరు బాగుండాలి అదే క్రమంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా చూడాలని కోరారు. ఈ ట్రాఫిక్ విషయంలో ప్రజలు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయడం వల్ల స్థానిక పోలీసులు మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కావున ఒక క్రమపద్ధతిలో వ్యాపారం చేసుకోవాలని తెలిపారు. మీరు ఇబ్బందులు పడకండి. ప్రజలను ఇబ్బందులు పెట్టకండని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, కొత్తపేట రైతు బజార్ ఈ.ఓ.స్రవంతి, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *