కరాచీ, డిసెంబర్ 26 : పాకిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజుల్లో బలోచిస్తాన్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) బృందం చేసిన దాడుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ సైన్యం డియా విభాగం ఆదివారం ప్రకటించారు. జోభో జిల్లాలోని సంబజ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక సైనికుడు, తాలిబన్ ఉగ్రవాది మృతి చెందినట్లు తెలిపారు.
డన్నక్ గోడ్డన్ ప్రాంతంలో సైన్యం వాహనంపై తాలిబన్లు దాడికి పాల్పడ్డగా, నలుగురు సైనికులు మృతి చెందారు. సరిహద్దు పట్టణం చమన్ వద్ద తాలిబన్లు జరిపిన దాడిలో ఒక సైనికుడు మృతి చెందాడు. ఇస్లామాబాద్, లాహోర్, ఇతర ప్రాంతాల్లోనూ తాలిబన్లు దాడులకు తెగబడుతున్నట్లు పాక్ సైన్యం పేర్కొంది.



