పల్లెవాసుల సాహిత్యంగా జానపదం స్థిరపడింది

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 21 : ఏ భాషలో అయినా మొట్ట మొదట జానపద సాహిత్యమే పుడుతుందని, జానపదం ఇది పల్లెవాసుల సాహిత్యంగా స్థిరపడిందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్పందన ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ జానపదుల మణిహారం ఆర్ట్ ఫామ్స్ కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు లయన్ కేవీ రమణారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ పల్లెల నుంచి, సామాన్యుల నుంచి పుట్టిందే జానపద సాహిత్యం అని అన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు సినీనటి ఊర్వశి పటేల్, అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాల మురళీకృష్ణ గురు స్వామి, బుర్మ చక్రపాణి, రాఘవ చార్యులు, వినయ్ పాత్రలే హాజరైన ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా రవీందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీరాందాస్ వ్యవహరించారు. ఈ సందర్బంగా నాట్యాగురువు శ్రీకాంత్ గౌడ్ ను మామిడి హరికృష్ణ,లయన్ కె.వి.రమణారావు, రాంకీ తదితరులు తదితరులు ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *