పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

జోరువానతో చల్లబడిన నగరం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న రాష్ట్రం చల్లబడిరది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
దాదాపు అరగంట పాటు అక్కడక్కడా పెద్ద జల్లులు పడ్డాయి. వారం రోజుల నుంచి చెబుతున్నట్టుగానే తెలంగాణలో అప్పుడప్పుడూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూనే ఉంది. వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడిరది. దీంతో ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *