పర్యావరణ హితమే ఈనూక్ మోటార్స్ లక్ష్యం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 05 : పర్యావరణ హితమే కాకుండా తక్కువ ధరలలో నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులను తమ స్కూటర్స్ తీసుకొని రానున్నాయని ఈనూక్ మోటార్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ పటేల్ వివరించారు. ఈ మేరకు శనివారం నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో టాలీవుడ్ తారలు ఇషా చావ్లా, పూజితా పొనాడ, హెబ్బా పటేల్ సమక్షంలో ఈ షోరూం ప్రారంభించి పలు రకాల ఈ-స్కూటర్స్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఈనూక్ ఎండి హితేష్ పటేల్ మాట్లాడుతూ ఇది నగరంలో మొట్ట మొదటి షోరూం అని, నగర ప్రాంతాలలో ప్రయాణ సదుపాయాలలో విప్లవాత్మక మార్పును తీసుకొని వచ్చేందుకు వీలుగా తీసుకు వచ్చామన్నారు. ఈనూక్ మోటార్స్ సిఈఓ సియస్ జాదవ్ మాట్లాడుతూ ఇతర బ్రాండ్ ల కన్నా అందుబాటైన ధరలలోనే కాకుండా మరింత సమర్థవంతమైన పనితీరును కనపరుస్తాయని వివరించారు. త్వరలో మరిన్ని షోరూంలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనూక్ ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశన్ మాట్లాడుతూ ఈ సరికొత్త ఈ-స్కూటర్స్ స్థిరత్వం, సౌలభ్యం, శైలి, భద్రత యొక్క మిశ్రమం రూపొందించ బడ్డాయన్నారు. షోరూం ను ప్రారంభించిన టాలీవుడ్ సినితారలైన ఇషా చావ్లా, పూజితా పొనాడ, హెబ్బా పటేల్ మాట్లాడుతూ ఈ స్కూటర్లు పర్యావరణానికి మరింత మేలు చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *