చూడడానికి ఆకర్షణీయంగా, తయారు చేయడానికి అనుకూలంగా, చవకగా ఉండడంతో భక్తుల నుంచి మంచి ఆదరణ లబి స్తుండడం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపీ)’తో చేయ బడిన వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు వీధి వీధిన /వాడ వాడన వెలుస్తున్నాయి. పిఓపీతో చేయబడిన అతి భారీ గణేష విగ్రహాల నుంచి చిట్టి వినాయక మూర్తుల వరకు కోట్ల/లక్షల వినాయక విగ్రహాలను ప్రతి ఏట భక్తులు పూజకు వాడడం అనాదిగా జరుగుతుంది. పిఓపీ విగ్రహాల తయారీలో వాడే ప్రధాన రసాయనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓపీ) నుంచి విగ్రహాన్ని ఆకర్షణీయంగా మార్చడంలో వాడే వివిధ ప్రమాదకర రంగుల వరకు ప్రతి ఒక్కటి నిమజ్జనం తరువాత తీవ్ర జల కాలుష్యానికి కారణం అవుతున్నాయి. మట్టి వినాయకులను తయారు చేయడానికి చాలా సమయం పడుతుందని, ఖరీదు కూడా ఎక్కువగా ఉండడంతో అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. పిఓపీ విగ్రహాలను తయారు చేయడం సులభం, ఖరీదు తక్కువ, ఆకర్షణీయంగా ఉండడంతో అమ్మకాలు పెరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వినాయక చవితి పర్వదిన వేళల్లో జరుగుతున్న గాలి, జల, శబ్ద, ఘన వ్యర్థాల కాలుష్య పట్ల అవగాహన కలిగి ఉండడం, పర్యావరణ హిత ప్రత్యామ్నా యాలను ఆచరణలో పెట్టడం సత్వరమే జరిగేలా అందరం అడుగులు వేయాలి.
ప్రమాదకర రసాయనం పిఓపీ :
‘ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్’ రసాయన నామం కాల్షియం సల్ఫేట్ హెమీ-హైడ్రేట్. దీనికి CaSO4.1 /2H2O అనబడే ఫార్ములా ఉంటుంది. గణనాయకున్ని 9 రోజులు పూజించిన పిదప అట్టహాస ఊరేగింపులతో, భక్తి పూర్వక నృత్యాలతో సమీప చెరువు, సరస్సులు, నదులు, కాలువలు(కెనాల్), సాగరాల్లో నిమజ్జనం చేయడంతో వినాయక చవితి పర్వదిన గడియలు ముగుస్తాయి. నీటిలోకి చేరిన పిఓపీ గణేష విగ్రహాలు ప్రమాదకర జల కాలుష్యానికి కారణం అవుతుండడం హెచ్చరికగా భావించాలి. నీటిలో చేరిన పిఓపీ పూర్తిగా కరగడానికి పలు మాసాల సమయం పడుతుంది. విగ్రహ తయారీలో వాడిన పలు రసాయన రంగులు కూడా జలచరాలకు, ఆ నీటిని తాగే జీవులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని తెలుసుకోవాలి. గణనాయకుడి తయారీలో వాడిన రంగుల్లో ప్రాణాంతక పాదరసం, సీసం, బేరియం, క్యాడ్మియం, నైట్రేట్స్, నైట్రైట్స్ లాంటి విష లోహాలను వాడడంతో ఈ లోహాలు నిమజ్జన రూపంలో నీటిలోకి చేరుతాయి. పిఓపీ విగ్రహాల నిమజ్జ నంతో ఆ నీటిలో ఆమ్లగుణం, టోటల్ డిసాల్వుడ్ సాలిడ్స్, మెర్క్యురీ, లెడ్ లాంటి హెవీ మెటల్స్ గాఢతలు పెరగడంతో జలచరాల ఉనికి ప్రమాదంలో పడడమే కాకుండా ఆ నీటిని తాగే ప్రజలు, జంతువులు, జల మొక్కలు/వృక్ష సంపదల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారి జల వ్యవస్థలు (ఎకో సిస్టమ్ అండర్ వాటర్) ప్రమాదకరంగా మారుతున్నాయని గమనించాలి. వీటికి తోడుగా పిఓపీ విగ్రహాల తయారీలో వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ లాంటివని కూడా జల పర్యావరణ విచ్ఛిన్నానికి ఆజ్యం పోస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి నిషేధం విధించినప్పటికీ పిఓపీ విగ్రహాల తయారీ యంత్రాంగం దినదినం పెరుగుతూనే ఉన్నది.

ఇతర కాలుష్య అంశాలు:
నిమజ్జన ఊరేగింపులో ఉపయోగించే డిజే సౌండ్స్ శబ్దాలు కూడా ప్రమాదకర స్థాయి 55 డెసెబుల్స్ దాటుతూ శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఈ శబ్ద కాలుష్యంతో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు త్వరగా ప్రభావితం అవుతున్నారు. ఈ నిమజ్జన ఊరేగింపుల్లో తక్కువ స్థాయిలో సౌండ్స్ వాడుతూ భక్తి పూర్వక భజనలు, కీర్తనలు, నృత్యా లతో వినాయకుడిని వేడుకోవాలని పర్యావరణ హితవులు సూచిస్తున్నారు. ఊరేగింపుల వల్ల ప్రమాదకర సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులతో గాలి కాలుష్యం కూడా కలుగుతుందని గమనించాలి. వినాయక చవితి పర్వదినాల్లో భక్తులు సమర్పించుకునే పూలు, లోహ నగలు, పూజా ద్రవ్యాలు, పండ్లు, కొబ్బరి కాయలు, అగరువత్తులు, క్యాంఫర్ బిల్లలు, బట్టలు, ప్లాస్టిక్, ప్లాస్టిక్, థర్మోకోల్ లాంటి పదార్థాల తొలగింపులో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం సముచితంగా ఉంటుంది. పర్వది నాల తరువాత చెరువులను, కాలువలను శుద్ధి చేయడానికే కాకుండా వ్యర్థాలను తొలగించడానికి కూడా ప్రభుత్వాలు ప్రతి ఏట కోట్ల రూపాయలను వెచ్చించడం చూస్తున్నాం.

ఉత్తమ మార్గం ఏమిటీ..?
మట్టి వినాయకుల తయారీలో కొన్ని విత్తనాలను వాడడం ద్వారా నిమజ్జన అనంతరం మొక్కలుగా ఎదుగు తాయని గమనించాలి. విగ్రహాల తయారీలో వాడే ప్రతి వస్తువులు తిరిగి వాడుకునే (రీసైక్లింగ్) విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవు పేడతో కూడా విగ్రహాలు తయారు చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిస్తున్నది. విగ్రహ తయారీలో వాడుకునే ప్రతి వస్తువు సహ జంగా లభించేదిగా ఉండేలా చూసుకుందాం. ప్రమాదకర అందమైన విగ్రహాలకు బదులు పర్యావరణ హిత మట్టి విగ్ర హాలను మాత్రమే పూజలకు వినియోగించాలి. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయడం, సహజ మట్టిని మాత్రమే వినాయకుల తయారీని ప్రోత్సహించడం, పిఓపీ విగ్రహాల తయారీని నియం త్రించడం లేదా క్రమంగా తగ్గించడం, గృహాల్లో పూజలకు వినియోగించిన విగ్రహాలను బకెట్ నీటిలో నిమజ్జనం చేయడం, పంచ లోహ, కాపర్, బ్రాస్ వినాయకులను బకెట్ నీటిలో నిమజ్జనం చేసి తిరిగి అవే విగ్రహాలను వాడుకునే కుటుంబాలు కూడా మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పిఓపీ విగ్రహాలను వినియోగించిన వారు నిమజ్జనం చేయకుండా తిరిగి వాడుకోవచ్చని కూడా సూచిస్తున్నారు.

పూజలో వినియోగించిన పండ్లు, ప్రసాదాలు, మిఠాయిలు, కొబ్బరి వంటి పవిత్రతతో కూడిన ఆహార పదార్థాలను భక్తులకు వితరణ చేయడంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పూలు, కాగితాలను రీసైక్లింగ్ చేయడం కూడా ఓ ఉత్తమ ఆలోచన అని గమనించాలి. నిమజ్జన ఊరేగింపులో 40 డెసిబుల్స్ దాటకుండా మైకులను నియంత్రించాలి. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలను విగ్రహ తయారీలో వాడకుండా నిషేధం విధించాలి. ఈ విషయాలను అవగాహన పరడానికి బాధ్యతగల పౌరులు, స్వచ్ఛంద సేవకులు, ఎన్జిఓలు, ప్రభుత్వ శాఖలు, మత పెద్దలు తమ తమ ఆలో చనలు జోడించాలి.
భూమాత పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడు కుంటూనే మన పండుగలను భక్తి పూర్వకంగా పరిమిత హద్దులను ఏర్పరచుకొని జీవకోటి ఆయురా రోగ్యాలకు పునా దులు వేద్దాం. పర్యవరణ హిత మట్టి గణపతులను పూజి ద్దాం. ఆకు పచ్చ ఆలోచనలకు ఆజ్యం పోద్దాం. ఆరోగ్య ప్రదాత అయిన తొలి పూజలను అందుకునే హరిత వినాయ కుడికి మనస్ఫూర్తిగా దండం పెడదాం, దీవెనలు పొందుదాం.
పిఓపీ గణేషులు వద్దు – మట్టి వినాయక విగ్రహాలే ముద్దు.
సే నో టు పిఓపీ గణేషా బీ సే ఎస్ టు క్లేవినాయకా !
గణపతి బప్పా మోరియా బీ జై గణేష బీ జై జై గణనాయకా.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037