పరుగులు తీస్తున్న బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్‌ ‌ముగిసినా ఆగని పెరుగుదల
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు సర్వసాధారణమే అయినా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి వారికి అందకుండా పోతున్నాయి. పేదైతే ఇటువైపు చూడకుండా వన్‌‌గ్రామ్‌ ‌గోల్డ్‌వైపు పరుగులు తీస్తున్నారు. మొన్నటి వరకూ కాస్త తగ్గిన బంగారం ధర.. మళ్లీ పెరగడం ఆరంభమైంది. గురువారం బంగారం ధర రూ.540 మేర పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం మరోమారు తులం బంగారంపై రూ.170 వరకూ పెరిగింది. వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో తులం బంగారం ధర రూ.45 వేల వద్ద ఉండగా..

ప్రస్తుతం తులం రూ.50 వేల మార్కును దాటేసింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.150 మేర పెరిగి రూ.50,250కి చేరగా.. 24 క్యారెట్ల ధరపై రూ.170 పెరిగి.. రూ.54,820కి చేరుకుంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,820గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,250.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,820గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,240.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,900గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *