మన దేశంలో నిర్వహించుకునే ప్రతి పండుగకు ఒక బలమైన కారణం ఉంటుంది.అది మన భారతీయ సంప్రదాయాల వెనుక దాగిన రహస్యం. మన ప్రాచీనులు ఒక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే.. ఆ మాసానికి ఆ నక్షత్ర పేరును పెట్టడం జరిగింది.
ఆ విధంగానే శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడున్నందున ఈ మాసం పేరు శ్రావణం గా మారింది. శ్రావణం కార్య సాధక నక్షత్రం. శ్రీ మహా విష్ణువు జన్మించిన నక్షత్రం కూడ శ్రవణమే. కాల గమనంలో వర్ష ఋతువు ఆగమనంతో భూదేవి తడిసి, రైతన్న వ్యవసాయానికి సిద్ధం కావడం.లక్ష్మీ దేవత భూమి నుండి ధాన్యలక్ష్మిగా అవతరించడం, ఆ ధాన్యం క్రమంగా ధనలక్ష్మిగా రూపుదిద్దుకోవడం… ఇలా లక్ష్మీ దేవతలందరి జననానికి కారణమైనటువంటిది ఈ శ్రావణ మాసం.ఈ శ్రవణా నక్షత్రానికి అధిపతి -చంద్రుడు. ఈ చంద్రుడు ఆకర్షణీయెంగా, ఆహ్లాదకరమైనమనసుకి ప్రశాంతతని కలు గజేస్తాడు. అందుకే చంద్రున్ని చూస్తున్న కొద్ది మరింతగా చూడాలని అనిపిస్తుంది. నక్షత్రాధిపతి అయిన చంద్రుడు మాసంలోని 15వరోజున ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తాడో ఆ రోజుననే అంటే ..శ్రావణం లోని పూర్ణిమ శ్రావణ పౌర్ణమిగా పరిగణించబడుతుంది.
‘‘రాకా చంద్ర సమాన కాంతి వదనామ్’’ఈ వాక్యంలో’ రాకా’ అనే మాటకు తనకున్న పదిహేను కళలతో కూడిన చంద్రుడు ఉన్న పౌర్ణమి అని అర్థం. ఈ పౌర్ణమి రోజున కట్టే రాకా సంబంధం ఉన్న తాడును ‘రాఖీ’ అని అంటారు. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఉదయ కాలంలో స్నానమాచరించిన వ్యక్తి తానెవరికి రక్షణగా సంవత్సర కాలం పాటు ఉండదలచాడో వారి మణికట్టుకి కట్టి ముడివేసి దానిని పరమ పవిత్రంగా భావించి దానిపై అక్షతలను మనః పూర్వకంగా వేయాలని హేమ చంద్రీయం అనే గ్రంథంలో పేర్కొనబడిరదని పండితుల విశ్లేషణ.ఈ రాఖీ పౌర్ణమి పర్వదినంపై పలు రకాల కథనాలు ఉన్నాయి.
ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు తన సైన్యంతో దేవతలం దరిని జయించి ఆ దేవతా భూముల్ని కూడ తన భూములతో కలుపుకుని మొత్తం భూమికి అధిపతిగా బలి చక్రవర్తిగా అనిపించుకున్నాడు. దాదాపుగా దేవతలందరికి నిలువ నీడలేని పరిస్థితి దాపురించినపుడు వారంతా శ్రీహరిని ప్రార్థిస్తూ పాహిమాం అని వేడుకోవడంతో ఆయన వామన అవతారం ఎత్తి బలిని మూడడుగుల నేలను అడిగి త్రివిక్రమునిగా భూమ్యాకాశాలను ఆక్రమించి మూడవ అడుగును బలి చక్రవర్తి తల మీద పెట్టి కింది లోకానికి పంపించడం.ఫలితంగా దేవతలకు వారి భూములు తిరిగి లభించడం జరుగుతుంది. ఈ సందర్భంలో
నిదైన యేన బద్దో బలీ రాజా
దానవేంద్రో మహా బలః
తేన త్వామభి బద్నామి
రక్ష మాచల మాచల
అంటూ శ్లోకాన్ని చదివి
రాక్షస రాజైన బలి చక్రవర్తి శ్రీహరి చేత బంధింపబడిన వాడై బలి చక్రవర్తి చిరకాల వాంఛ అయిన శ్రీహరి ఏ విధంగా రక్షణని పొందాడో అలాగే నీవు కూడ నాకు ముఖ్యుడైన వ్యక్తిచేత నన్ను ముడి వేసి ఆ వ్యక్తి రక్షణను నాకు కలిగిస్తూ మా బంధాన్ని ఎప్పుడు సడలనీయకు అని రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించుకుంటారు.
వృత్తాసురుడనే రాక్షసునితో ఇంద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఓడిపోయే పరిస్థితి సంభవించినపుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఒక పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకు కట్టిందని దీనితో ఆయన రాక్షసులను ఓడిరచి విజయం సాధించాడని అలా రాఖీ పౌర్ణమి ఆరంభమైందని కథనం.
చిత్తోర్ గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢల్లీి చక్రవర్తి హుమాయూన్‌కు రాఖీని పంపి గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్ర నుంచి తమ రాజ్యాన్ని రక్షించవ లసినదిగా కోరడం జరిగిందని కూడ కథనం.దీనిని బట్టి కొన్ని వేల సంవత్సరాల కిందటే రక్షాబంధన్ కార్య క్రమం ఉందని తెలుస్తోంది.ముఖ్యంగా వేదకాలంనుండే దీనికి విశేషప్రాచుర్యం ఉందని స్పష్టమవుతోంది. వేదకా లంలో ఈ పండగను కేవలం సోదరసోదరిమణుల బంధం గానే కాదు. భార్యాభర్తలకు సంబంధించినదని కూడ పురాణగాథలలో గోచరిస్తుంది. విశ్వవిజ్ఱేతగా నిలవాలనే తపనతో గ్రీక్ యువరాజైన అలెగ్జాండర్ క్రీ.పూ 326 లో భారతదేశంపై దండెత్తి వచ్చినపుడు ఆ క్రమంలో బాక్ట్రియన్ యువరాణి ని వివాహం చేసుకొని, ఈ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం- చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్‌ఆ రాజులపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. పురుషోత్తముడిపై దండెత్తి రావాలని అలెగ్జాండర్ ను అంబి ఆహ్వానించడంతో జీలం నదుల ఒడ్డున యుద్దానికి సిద్దం కావడం జరుగుతుంది.
పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రొక్సానా ఆయనను తన సోదరునిగా భావించి రాఖీ కట్టడం,ఆ యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ గనుక ఓడిపోతే చంపవద్దని కోరుతుంది. అందుకు అలెగ్జాండర్ ను చంపే అశకాశం వచ్చిన తన చేతికున్న రాఖిని చూసి పురుషోత్తముడు చంపకుండా వదిలేయడం జరిగిందనే కథనం కూడ ఉంది. రక్షను కట్టే ప్రతి సోదరి కూడ తన సోదరులు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీని కట్టి ఎల్లప్పుడు అన్నకు అండగా ఉంటానని, అదే విధంగా రాఖిని స్వీకరించిన అన్న కూడ తానెప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండగ ద్వారా తెలియజేస్తారు. సోదరునికి రక్ష ను కట్టే ప్రతి సోదరి బొట్టు పెట్టి, హారతిని ఇచ్చి, స్వీట్స్ తినిపిస్తారు. ఇందుకు ప్రతిఫలంగా సోదరుడు ఇచ్చేటువంటి ఏ కానుక అయిన సరే విలువైట్కనదిగా, తీపి జ్ఞాపకంగా భావిస్తారు కాని వెలకు ప్రాధాన్యత ఇవ్వరు. అందుకనేసోదరసోదరిమణుల మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు ఈ రాఖీ పండగ అద్దం పడుతుంది.
ఏ బంధం లేకున్నప్పటికి సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరు రక్ష కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు.అంతే కాకుండ మిత్రులు సైతం నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి రక్ష అని ఈ రక్షా బంధన్ కార్యక్రమం నిర్వహించుకునే సంస్కృతి ..మన దేశ ఔన్నత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచీ కరణలో భాగంగా సమాజంలో మానవీయ విలువలు పూర్తిగా మంట గలువకుండా ఉందంటే కారణం మనం జరుపుకునే ఇటువంటి పండుగలే..ప్రధాన కారణం.కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ప్రేమ, ఆత్మీయత ,అను బంధం, ఐకమత్యాలకు పరస్పర సహకారానికి చిహ్నంగా ఈ రక్షాబంధన్ పండగ నిలుస్తుంది.
` నరేందర్ రాచమల్ల,
9989267462




