సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా 2023- 24 సంవత్సరానికి గాను అధ్యక్షులుగా అయిత అంజయ్య ప్రధాన కార్యదర్శిగా కోమండ్ల విక్రం రెడ్డి ఆర్థిక కార్యదర్శిగా తోట మధుసూదన్, ఉపాధ్యక్షులుగా కెమ్మసారం పోచయ్య , కొండయ్య సహాయ కార్యదర్శులుగా రవీందర్ రెడ్డి, సత్యనారాయణ ఆర్థిక సంఘం సభ్యులుగా చిలుకోటి రాంరెడ్డి ,లింగా శ్రీనివాసులు కార్యవర్గ సభ్యులుగా బొల్లి మల్లేశం, కల్లేపల్లి శ్రీనివాసులు, సుంచు భూమయ్య, కాల్వ చక్రధర్, తాళ్ల శ్రీనివాసులు,ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి శ్రీ సంధి రెడ్డి యాది రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడు అయిత అంజయ్య ప్రధాన కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని మా కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నటువంటి జీవిత సభ్యులకు నాలుగు సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవన్ కు ఎంతో చరిత్ర ఉందని తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా నాలుగు సంఘాలతో ఏకమైనటువంటి ఈ సంఘం అత్యద్భుతంగా పనిచేస్తూ ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ సేవా పరమైన కార్యక్రమాలు కూడా చేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచిగా పని చేసి మాపై ఏదైతే బాధ్యతను నిలిపారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇంకా మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలియజేశారు.




