పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.బుధవారం అమీన్ పూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో వార్డుకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ చైర్మన్ టిపిఆర్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. నూతనంగా ఏర్పడిన అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో 150 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే జిఎంఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించనున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ, సాధువు మల్లేష్ సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, గోపాల్, చంద్రశేఖర్, మ్యకం మల్లేష్, సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *