పదేళ్ల ఉమ్మడి రాజధానిలో లబ్ధి పొందింది ఎవ్వరూ…!

నాడు తెలంగాణ ఆంధ్ర విభజనలో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్‌ను ప్రకటించారు.  ఆగడువు రేపు జూన్‌ రెండుతో ముగియనుంది. తెలంగాణ ఆంధ్ర రాజకీయలో అల్లజడి మొదలు కాబోతుంది. ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరుగలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితం అయినవి దీంతో రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరిగింది.  కృష్ణా డెల్టా వాటర్‌ విషయంలో కానీ విద్యుత్తు వినియోగంలో కానీ వివాదాలు నేటికి జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాలు చివరకు ఫైనల్‌ చేరుకున్నాయి.  జూన్‌ రెండుతో గడువు ముగియనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు మాజీ సిబిఐ డైరెక్టర్‌ జేడీ లక్ష్మినారాయణ రాష్ట్ర పతి ద్రౌపది ముర్ముకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఇంకా పదేళ్ళ పాటు పొడగించాలని రాష్ట్ర పతికి ట్వీట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేయడం జరిగింది.  లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ ఈ విషయంపై ఆసక్తికర ఆరోపణలు చేసింది.

దీంతో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని విషయంపై అధికార ప్రతిపక్షాలు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పదేళ్లకు మించకుండా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని  ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్‌ తెలిపింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి రాజధాని లేకపోవటంతో ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ మరో పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందంటుందని మరి కొందరు ముఖ్యులు అభిప్రాయ పడుతున్నారు. ఇది సరైన వాదననే అని అక్కడక్కడ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై తెలంగాణ నేతలు ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఇక ఎంతో కాలం కొనసాగదు దాని కాల వ్యవధి ముగిసిపోయే సమయం  దగ్గర్లోనే ఉంది. జూన్‌ 2వ తేదీ నాటికి ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుంది. భాగ్యనగరం 2014 జూన్‌ 2వ తేదీన తెలంగాణ అపాయింట్‌ డే సందర్భంగా ఏపీ – తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ప్రకటించింది అప్పటి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 2024 జూన్‌ 1వ తేదీ వరకు ఉమ్మడి కేపిటల్‌ సీటీగా హైదరాబాద్‌ కొనసాగుతుందనీ ప్రకటించారు.

ఇదే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోనూ పొందుపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను  రెండు ముక్కలుగా 2014లో విభజించినప్పుడు అప్పటివరకూ రెండు ప్రాంతాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవరూ ఇబ్బందిపడకుండా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్‌ 2 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టం తెలుపుతుంది. దీంతో ఈసారి జూన్‌ 2న ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది. కాబట్టి తర్వాత ఏం జరగబోతోందనే టెన్షన్‌ ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అల్లజడి మొదలయింది. జూన్‌ 2న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ముగిసిపోయి కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండబోతుంది దీంతో తెలంగాణ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా హైదరాబాద్‌ కొనసాగే అవకాశం ఉంది. ఈ అంశంలో ఇప్పుడు ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దీనికి కారణం పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఎలాంటి విద్వేషాలు, కలహ?లు భేధాబి óప్రాయాలు లేకుండా కొనసాగడంతో కేంద్ర ప్రతిపాదన పదేళ్ల పాటు అమలైంది.

ఇప్పటికే ఏపీకి రాజధానిగా అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు ఎంపిక చేయడం జరిగింది, జగన్‌ మూడు రాజధానులు తెచ్చినా వాటిపై సుప్రీంలో కేసు నడుస్తుండటంతో అది తేలే వరకూ దానిపై ఎలాంటి చర్చ లేదు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ముగిసిపోవడం వల్ల ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య పెండిరగ్‌ లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ హైదరాబాద్‌ అనే ఓ బంధం కారణంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వచ్చాయి కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు ముందుకు పడతాయి. ఈ సమయంలోనే దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరగడం ఏ ప్రభుత్వం వస్తుందో వచ్చిన తర్వాత ప్రభుత్వం స్థిరపడిన తర్వాత ఉమ్మడి రాజధానిపై చర్చించే అవకాశం ఉంది. లేకపోతే గడువును పోడగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన జరిగిన దాదాపు 10 ఏళ్ల క్రితం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదారాబాద్‌ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు.

ఈ మేరకు 2014 జూన్‌ 2 నుంచి 2024 జూన్‌ 1 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. జూన్‌ రెండో తేదీతో ఈ గడువు ముగియనుంది. తదనంతరం హైదరాబాద్‌ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఈ క్రమంలోనే హైదారాబాద్‌లోని ఏపీ కార్యాలయాలు అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి మార్చుతున్నారు. 2016లోనే 90 శాతం కార్యాలయాలు తెలంగాణ నుంచి ఏపీకి తరలించారు. తాజాగా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు మార్చారు. రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లైనా ఆస్తుల పంపిణీ మాత్రం నేటివరకు పూర్తి కాలేదు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు సైతం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోవటంతో విభజన ప్రణాళికలోని ఇతర అంశాలు, 1.4 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పంచడం వంటి ఇతర అంశాలు కూడా పెండిరగ్‌లో ఉన్నాయి. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.

ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడగొట్టరాదాని ఆంధ్ర నాయకులు ప్రయత్నించిన తప్పని పరిస్థితిలో అంటే ఉద్యమం చివరి దశకు చేరుకుంది దీంతో కాంగ్రెస్‌ చేసేది ఏమి లేక రాష్ట్రాన్ని విభజించడం జరిగింది కానీ నేటికి తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చామని కాంగ్రెస్‌ ప్రచారం చేసుకుంటుంది.  విభజన సమయంలో ఆస్తుల పంపకాలు కొన్ని చేశాయి.  మరి కొన్ని పెండిరగ్‌ లో పెట్టారు. ఇంకా చిన్న చితక ఉమ్మడి ఆస్తులు ఉన్న వాటిని పంచుకునే సమయం ఆసనమైంది. చివరగా రెండు రాష్ట్రాల విభజన అనంతరం అభివృద్ధి లో కానీ సంక్షేమంలో తెలంగాణ ముందు ఉంది. ఉద్యమ సమయంలో మీకు పరిపాలన సాధ్యం కాదు.  తెలంగాణ వస్తే రాష్ట్రమంత చీకటి అవుతుందని అవహేళన చేసిన పార్టీలు ఏవైనా చాలెంజ్‌ గా తీసుకుని దిగజారుడు రాజకీయాలు కాకుండా పదేళ్లు ముందుకు పోవడం జరిగింది. కేంద్ర, అంతర్జాతీయ సంస్థల నుంచి తెలంగాణకు అవార్డులు రివార్డులు రావడం జరిగింది. అలాంటిది ఇక ముందు కూడా అన్ని విధాలుగా ముందుకు పోవాలని ఆశిస్తూ రెండు రాష్ట్రాల ప్రజలు ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు వాళ్ళుగా కలిసిమెలసి జీవిస్తున్నారు.  ఇదే ఒరవడి ముందు ముందు కొనసాగాలని  కోరుకుంటూ నీటి వాటా విద్యుత్‌ వినియోగం ఆస్తుల పంపకాలు సఖ్యతతో జరగాలని రెండు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.

మిద్దె సురేష్‌,
కవి, వ్యాసకర్త
9701209355 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *