పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 2: పటాన్ చెరు పట్టణ పరిధిలోని గౌతమ్ నగర్, చైతన్య నగర్, శాంతినగర్ కాలనీలో ఎక్కడీ చెత్త అక్కడే పేరుకుపోయింది. అధికారులు చెత్తను జిహెచ్ఎంసి ఆటోలకు వేయాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఆటోవాలలు నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ అడుగుతుండడంతో ఇచ్చుకోలేని వారు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. మరోవైపు చెత్త కుండీలు ఉండే చోట చెత్త పేరుకు పోకుండా సిబ్బందిని కాపలాగా ఉంచి ఎవరు చెత్త వేయకుండా అవగాహన కల్పించేవారు. అవసరమైతే జరిమానాలు వేసేవారు. ఇటీవల అటువంటి చర్యలు లేవు అవగాహన కల్పించడం లేదు. దీంతో పలు కాలనీలలో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. ఇకనైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి పరిశుద్ధ విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పలు కాలనీలా ప్రజలు కోరుకుంటున్నారు.
పటాన్ చెరు పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే




