మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజాన్ని తీర్చిదిద్దడంలో మహిళల పాత్రను తెలియజేస్తూ.. వివిధ రంగాల్లో అతివల కృషిని అభినందిస్తూ స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆర్థికాభివృద్ధిలో వారు పోషిస్తున్న ముఖ్య భూమికను రోజంతా వివరిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సృష్టికి మూలం స్త్రీమూర్తికి ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’ సృష్టికర్త బీఆర్‌ఎస్ నాయకులు,రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఛాలెంజ్ విసిరారు.ప్రతి తల్లి తమ పిల్లల్ని పెంచడంలో చూపించే ప్రేమ మొక్కలను పెంచేందుకు చొరవచూపెట్టడం వల్ల మానవ మనుగడకు డోకా ఉండదని, చంటి బిడ్డను జాగ్రత్తగా కాపాడినట్లే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల అరణ్యాలుగా మారి ప్రకృతి పరవశించిపోయి పచ్చని చెట్లతో, నెల పచ్చని తోరణాలను కప్పుకున్నట్లుగా సత్పలితాలు కనిపిస్తున్నాయి.
ప్రకృతి పరిరక్షణ కోసం నలుచెరుగుల ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా మన్నన పొందింది.భారత లక్ష్యాన్ని ఛేదించే దిశగా బంట్రోతు నుండి చీఫ్ సెక్రెటరీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధులు యజ్ఞంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటి పుడమి తల్లికి పచ్చలహారం వేసేందుకు కంకణబద్దులైనారు.కేసీఆర్ చేపట్టిన హరితహారం ఈ రోజు చిట్టడవులుగా మారినాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో హరితవనంగా తీర్చిదిద్దడానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్క పిలుపుతో కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త సాలుమారద తిమ్మక్కగారి స్పూర్తితో ప్రతి ఒక్కరూ.అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నడుంబిగించారు.
మానవ శ్రేయస్సు మరియు అడవుల దీర్ఘకాలిక పరిరక్షణ,అవి కొనసాగించే పర్యావరణ వ్యవస్థలు మరియు ఈ కీలకమైన సహజ వ్యవస్థలతో మరింత స్థిరమైన సంబంధాన్ని నెలకొల్పడానికి దోహదపడే సాంప్రదాయ పద్ధతులు మరియు జ్ఞానం యొక్క విలువను ప్రోత్సహిస్తాయి. ఒకప్పుడు పక్షుల కిలాకిలారాగాలు.. జంతువుల అరుపులతో అడవులు కళకళలాడాయి.. ఇప్పుడు అభివృద్ధి పెరుగుతున్నకొద్ది అడవులు తరిగిపోతున్నాయి.. దీంతో అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులు కనుమరుగవుతున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం వాటి రక్షణ కోసం నడుం బిగించింది. దానిలో భాగంగా హరితహారం ప్రతిష్టాత్మకంగా తీసుకోని ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. పల్లె ప్రగతితో గ్రామాల్లో ఇప్పటికే హరితశోభితను సంతరించుకుంది.సమస్త జీవరాశులు ఆరోగ్యంగా, ఆహ్లదకరంగా ఉండేందుకు ఖాళీ ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో పుడమితల్లి పచ్చదనంతో పరిఢవిల్లే విధంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను ఆకుపచ్చ హబ్ (గ్రీన్ హబ్) గా మార్చే మహాయజ్ణంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త ఎంపీ, సంతోష్ కుమార్ ..
చంద్రుడికో నూలుపోగులాగా అయన వెన్నంటి ఉంటూ వేల ఎకరాలను దత్తత తీసుకోని అభయారణ్యాలుగా తీర్చిదిద్దడం తనకు వ్యసనంగా మారింది.అయన చేపట్టిన ఛాలెంజ్ కార్యక్రమానికి దేశ,విదేశాల్లో మంచి స్పందన వచ్చింది.అయన పిలుపుతో ఇప్పుడు దేశం అంతా భాగస్వామ్యులు కావడానికి జనం తహ తహలాడుతున్నారు.హరితహారం మొదటి విడుతలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిగా మారి ఆహ్లాదాన్నిస్తున్నాయి.అయితే స్మగ్లర్లు,వేటగాళ్లు. వన్యప్రాణులు, అరణ్యాల పాలిట శాపంలా తయారయ్యారు.స్మగ్లర్ల దెబ్బకు కీకరారణ్యాలు సైతం మైదానాలుగా మారుతున్న పరిస్థితి దాపరించింది.
మానవాళి మనుగడ అడవులతోనే పెనవేసుకుందనే విచక్షణ కొందరు స్వార్థపరులు కోల్పోవడం వల్ల అటవీసంపద తరిగిపోతున్నది. ప్రస్తుతం కొంతమేరకు ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగింది. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ప్రపంచం లింగ సమానత్వాన్ని గుర్తించే అద్భుతమైన చారిత్రక కాలాన్ని మనం మహిళాదినోత్సవం రోజు చూడపోతున్నాం. భూతాపం సమస్యలు రోజు,రోజుకు పెరిగిపోతున్న తరుణంలో భూగర్భజలాలు అడుగంటుతున్న కాలంలో కరువు తాండవించకుండా ఉండేందుకు, జీవకోటి భవిష్యత్తంతా అడవులతోనే పెనవేసుకుందనేది గమనించి 2015లో హరితహారం చేపట్టడం ఎంపీ, సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. తద్వారా పక్షులు, కీటకాలు చేసే హమ్మింగ్ శబ్దాలతో ,అందమైన ప్రకృతిని పర్యాటకులకు ఏంతో అద్భుతమైన అనుభూతినిస్తున్నాయి. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నట్లుగా సమాజంలో మహిళల ప్రాముఖ్యత శ్లాఘనీయమైనది.వారు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తున్నారు మరియు ముఖ్యంగా, వారు పిల్లల అభివృద్ధిలో, సంచలనం సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలు సాధించడానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ స్త్రీలు శక్తి స్వరూపులని నమ్మి తలపెట్టిన టాస్క్, మొక్కలను నాటడంలో మహిళలను చైతన్యం చేయడంలో కీలకభూమిక పోషించి విజయాన్ని అందించడంలో ఎంపీ సంతోష్ మైలురాయిని అధిగమిస్తాడని, ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలను తీరుస్తుంది… కాని వారి దురాశను తీర్చలేదు… మహాత్మాగాంధీ అన్నట్లుగా ఇప్పటికే పల్లెప్రగతి, పట్టణప్రగతితో . చెట్లు ఏపుగా పెరిగడం వల్ల, అధిక ఉష్ణోగ్రతల వల్ల భూతాపం పెరగకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడి సత్పలితాలిస్తున్నాయి.
డా।। సంగాని మల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 9866255355




