శ్రీ సత్య సాయి,నవంబర్30 : జిల్లాలోని బుక్కపట్నం మండలం మారాల గ్రామ సపంలోని పంట పొలాల్లో భారీ కొండ చిలువ హల్‌చల్ చేసింది. మామిడి తోటలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులక సమాచారం అందించారు.
పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తి అక్కడకు చేరుకుని దాదాపు గంట పాటు కష్టపడి భారీ కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. కొండచిలువను పట్టుకోవడంతో చుట్టుప్రక్కల పొలాల రైతులు ఊపిరి పీల్చుకున్నారు.




