నేడు హనుమాన్‌ జయంతి శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : మంగళవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ఊరేగింపు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై..తాడ్‌బండ్‌ సికింద్రాబాద్‌ వరకు గౌలిగూడ రామమందిరం, పుత్లిబౌలి క్రాస్‌ రోడ్‌, ఆంధ్రా బ్యాంక్‌ క్రాస్‌ రోడ్‌, కోటి, సుల్తాన్‌ బజార్‌, రాంకోటి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి వ్నిదుగా కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *