- నేషనల్ సికల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషను ప్రారంభించనున్న మోదీ
- రాష్ట్రవ్యాప్తంగా ఆయుష్మాన్ కార్డుల పంపిణీ ప్రారంభం
హైదరాబాద్, పిఐబి, జూన్ 30 : ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యటించనున్నారు. మధ్యాహ్నం శాహ్డోల్లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు అయ్యి, అక్కడ నేషనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేషన్ మిషన్ను ప్రారంభిస్తారు. లబ్ధిదారులకు సికల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డుల ను ఆయన ప్రదానం చేస్తారు. సికల్ సెల్ వ్యాధి కలగజేస్తున్న తీవ్రమైన ఆరోగ్య సంబంధి సవాళ్ళను, మరీ ముఖ్యంగా గిరిజనుల విషయంలో రువ్వుతున్న సవాళ్లను ఎదుర్కుని పరిష్కరించడం ఈ మిషన్ ధ్యేయంగా ఉన్నది. ఈ మిషన్ను ప్రారంభించడం అనేది 2047వ సంవత్సరాని కల్లా సికల్ సెల్ డిజీజ్ ను ఒక సార్వజనిక ఆరోగ్య సమస్య స్థాయి నుండి పూర్తిగా మటుమాయం చేసే దిశలో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రయాసలలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది. నేషనల్ సికల్ సెకిల్ సెల్ అనీమియ మిషన్ను 2023వ సంవత్సర కేంద్ర బడ్జెటులో ప్రకటించడమైంది.
దీనిని దేశంలోని 17 రాష్ట్రాల పరిధిలో 278 జిల్లాలలో అమలు చేయడం జరుగుతుంది. ఆ 17 రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ఖండ్, ఛతీస్ గఢ్, పశ్చిమ బంగాల్, ఒడిశా, తమిళ నాడు, కర్నాటక, అసమ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, బిహార్, ఉత్తరాఖండ్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. మధ్య ప్రదేశ్లో సుమారు 3.57 కోట్ల ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’(ఎబి-పిఎమ్ జెఎవై) కార్డుల పంపిణీని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ సంస్థలు, గ్రామ పంచాయతీలు మరియు డెవలెప్ మెంట్ బ్లాకులలో నిర్వహించడం జరుగుతుంది. సంక్షేమ పథకాలను లబ్ధిదారులలో ప్రతి ఒక్కరికి అందించాలనే ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని సాకారం చేసే దిశలో వేసేటటువంటి ఒక అడుగుగా ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి 16వ శతాబ్దం మధ్య కాలంలో గోండ్ వానాను పాలించిన రాణి దుర్గావతికి పుష్పాంజలిని ప్రధాన మంత్రి సమర్పించనున్నారు. మొగలులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటాన్ని జరిపిన ధైర్యం, సాహసాలను కలిగిన, భయమన్నదే ఎరుగనటువంటి యోధురాలుగా రాణి దుర్గావతిని ప్రజలు ఈనాటికీ స్మరించుకోవడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా, శాహ్ డోల్ జిల్లాలో పకరియా గ్రామాన్ని ప్రధాన మంత్రి సాయంత్రం సందర్శించడంతో పాటు ఆదివాసి సముదాయం యొక్క అగ్రగామి వ్యక్తులతో, స్వయం సహాయ సమూహాలతో, పిఇఎస్ఎ పంచాయత్(ఎక్స్ టెన్శన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్) యాక్టు, 1996 సమితుల యొక్క నేతలతో, విలేజ్ ఫుట్ బాల్ క్లబ్స్ యొక్క సారధులతో భేటీ అయ్యి వారితో మాట్లాడనున్నారు.



