భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకోవడానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధువారం రానున్నారు. రాష్ట్రపతి పరయటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసారు. మూడు రోజుల ముందు నుండే ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో రానుండడంతో సారపాక ఐటిసి స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక హెలీప్యాడ్ సిద్ధం చేశారు.
రాష్ట్రపతి ముందుగా ఐటిసి గెస్ట్‌హౌస్‌కు వెళ్ళిన అనంతరం రోడ్డు మార్గాన సారపాక మీదుగా భద్రాచలం వొస్తారు. రామాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భారత ప్రథమ పౌరురాలుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రాచలం, సారపాకను భద్రతా బలగాలు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ బలగాలు కూడా ప్రత్యేక బంధోబస్తు నిర్వహిస్తున్నారు. ముందుగా పాఠవాలలకు,హోటల్స్, దుకానాలు మూచివేయనున్నారు. పట్టణంలో వాహనాలు నిలిపివేసారు.
రాకపోకలను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 వరకు రాకపోకలను నిలిపి వేసారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రసాద్ పథకంతో నిర్మిచన్ను టూరిజం కాటేజీలకు రాష్ట్రపతి శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం వీరభద్రా ఫంక్షన్ హాలులో కొద్దిసేపు సమ్మక్క-సారలమ్మ పూజారులతో మాట్లాడనున్నారు.




