నేడు బీజేపీ మహాధర్నాకు రాష్ట్ర హైకోర్టు అనుమతి

హైదరాబాద్‌, ‌జూలై 24(ఆర్‌ఎన్‌ఏ) : ‌బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. నేడు మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్తానం తెలిపింది. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలుఈ నిరసన కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అయితే అనుమతి కోసం హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ను బీజేపీ నేతలు సంప్రదించారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారు.

దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానంలో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అప్పుడు లా అండ్‌ ఆర్డర్‌ ‌గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది. 5 వేల మందికి వి•రు భద్రత కల్పించలేకపోతే ఎలా అంటూ పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *