సకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం
ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన అధికారులు
మహబూబ్‌నగర్,ప్రజాతంత్ర: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటు లోకి తెచ్చారు. బస్టాండ్ సపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో తెలంగాణకు మాత్రమే సాధ్యమైందని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారని, అన్ని పనులు ఒకేచోట పూర్తయ్యే అవకాశం లభిస్తుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్లో పర్యటనతో ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రధాన రహదారితో పాటు భూత్పూరు దారిలోని సకృత కార్యాలయాల భవన సముదాయం నుంచి సీఎం సభ జరిగే ఎంవీఎస్ కాలేజ్, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వరకు వివిధ రకాల పనులు చేపట్టారు. జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్ది, రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గులాబీ తోరణాలు, ప్లెక్సీలతో పట్టణాన్ని గులాబీ మయంగా మార్చారు. మహాత్మా గాంధీ రోడ్డు ఉన్నత పాఠశాల ఎదుట విద్యార్థుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా మహబూబ్ నగర్ అనగానే గుర్తుకువచ్చే పిల్లలమర్రి చెట్టును పోలిన మనిషి ఆకారం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంవీఎస్ కాలేజ్ నుంచి బీటీ రోడ్డు వేస్తున్నారు. సీఎం రోడ్డు మార్గాన వస్తుండటంతో చాలాకాలంగా పట్టించుకోని సమస్యలపై కూడా దృష్టి సారించారు. దీంతో పాలమూరు కొత్తందాలు సంతరించుకుంది. ఈ మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలమూరు సకృత కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని పాలకొండ సపంలో 22 ఎకరాల సువిశాల స్థలంలో రూ.55.20 కోట్లతో నిర్మించారు. ఓ వైపు హైవే-44, మరోవైపు 167వ జాతీయ రహదారికి మధ్యలో కొలువైంది. 62 శాఖలకు చాంబర్లు, కాన్ఫరెన్స్, వెయిటింగ్ హాళ్లు, 250 మంది కెపాసిటీ గల టింగ్ హాల్, 200 కార్లకు పార్కింగ్ ఏరియా, విశాలమైన లాన్లు, ఆహ్లాదపరిచేలా గార్గగెగ్, డ్రైవర్లకు రెస్ట్‌రూంలు, కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఔట్‌డోర్ సమావేశాలకు రెండున్నర ఎకరాల స్థలం కేటాయించారు.
కలెక్టరేట్ ఆవరణలోనే హెలీప్యాడ్ స్థలం అందుబాటులో ఉన్నది. అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరాయి. వివిధ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండనున్నారు. ఆదివారం ఈ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. లైటింగ్, డెకరేషన్లతో అందంగా అలంకరిస్తున్నారు.
దివ్యాంగులు ఆత్మస్థయిర్యంతో ముందుకు సాగాలి
వారికి అండగా తెలంగాణ ప్రభుత్వం చేయూత
వికలాంగ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ సందేశం
హైదరాబాద్,ప్రజాతంత్ర: ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచవికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మన్యూనతకు లోనవకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని దివ్యాంగులకు సీఎం పిలుపునిచ్చారు. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదనీ, తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్టాన్న్రి అత్యుత్తమ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం అవార్డులు అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి దివ్యాంగుల (వికలాంగుల) శాఖను ప్రత్యేక శాఖగా స్వతంత్ర విభాగంగా ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ. 500 పెన్షన్‌తో సరిపడితే, స్వరాష్ట్రంలో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అంతమందికి రూ.3016 పింఛన్ అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నామని చెప్పారు.
దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలతోపాటు ఇతర పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాల లో 4 శాతం రిజర్వేషన్‌ను అమలుచేస్తున్నామని సీఎం అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాంగుల కోసం ఉచిత కోచింగ్‌తోపాటు మెటీరియల్, ఉద్యోగ సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, ఎకనామిక్ రిహాబిలిటేషన్ సెంటర్లు, దివ్యాంగుల సలహా మండలి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన వీల్చైర్లు, త్రీ వీలర్ స్కూటీలు, చేతికర్రలు మొదలైనవి సమకూరుస్తూ రోజువారి జీవితంలో వారు ఎదుర్కొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలా అవకాశమున్న ప్రతీచోట వారి అత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సాధికారతను పెంచే దిశగా అవసరమైన అన్ని కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని వెల్లడించారు. రాబోయే కాలంలో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని పేర్కొన్నారు. దివ్యాంగులను మనలో ఒకరుగా ఆదరిస్తూ వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.




