నేడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

  • 60 స్థానాలకు పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి
  • అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి యత్నం
  • కాంగ్రెస్‌తో కలసి పోటీలో కమ్యూనిస్టులు

అగర్తల, ఫిబ్రవరి 15 : మూడు ఈశాన్య రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. 16న జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌జరుగనుంది. మేఘాలయ, నాగాలాండ్‌లలో 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల తరవాత మార్చి 2న అన్ని రాష్ట్రాల కౌంటింగ్‌ ‌జరుగనుంది. ఈ క్రమంలో తొలిదశలో 16న గగురువారం జరిగే ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బిజెపి తరఫున ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్‌ ‌షౄలు ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ ‌సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగవచ్చునన్న ఆందోళన కలిగిస్తోంది. కేవలం 36 లక్షలు జనాభాగల ఈశాన్య సరిహద్దు రాష్ట్రంలో ప్రత్యేక భద్రా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా భారీ పోలీస్‌ ‌బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రిపుర ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం కేంద్రంలోని తన అధికారాన్ని బిజెపి ఉపయోగిస్తోందన్నదని లెఫ్ట్ ‌పార్టీలు యథావిధిగా ఆరోపిస్తున్నాయి.

ఐదేళ్ల క్రితం అధికా రంలోకి వచ్చిన బిజెపి త్రిపురలో శాంతి భద్రతలను కాపాడిందని ప్రధాని మోదీ తన ప్రచారంలో ప్రస్తావించారు. వామ పక్షాలు 47 స్థానాల్లోను, మిగిలిన 13 స్థానాల్లో కాంగ్రెస్‌ ‌పోటీ చేస్తున్నాయి. బిజెపిని ఓడించాలన్న లక్ష్యంతో పరస్పర పోటీ నివారణ ఒడంబడిక జరిగింది. మరోవైపున తిప్రా మోర్చా కూడా పోటీలో ఉంది. కొన్ని చోట్ల త్రిముఖం, ఇంకొన్ని చోట్ల బహుముఖ పోటీ జరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు స్వేచ్ఛగా వోట్లు వేస్తే బిజెపి ఓడిపోవడం ఖాయమని లెఫ్ట్ ‌వాదిస్తోంది. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతోంది. పోలీసు, పారా మిలిటరీ బలగాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.  ఫ్లాగ్‌ ‌మార్చ్‌లతో సహా ప్రజల్లో విశ్వాస పునరుద్ధరణ చర్యలు తీసుకోవడం అవసరం. ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని చర్యలూ తీసుకున్నామని ఎన్నికల కమిషన్‌ ‌తెలిపింది.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగ ళవారం సాయంత్రం ముగిసింది. 60 మంది సభ్యులు ఉన్న శాసనసభకు గురు వారం ఎన్నికలు జరగనుండగా మార్చి రెండో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ముక్కోణ పోటీ నెలకొనడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అధికార బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి తమ ఆధిపత్యాన్ని నిలుపు కోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పటి ప్రత్యర్థులైన సీపీఎం-కాంగ్రెస్‌లు ఈసారి కలిసి పోటీ చేస్తుండడం విశేషం. త్రిపుర రాజవంశీయుడు ప్రద్యోత్‌ ‌మాణిక్య దేబ్‌ ‌బర్మ నూతనంగా ఏర్పాటు చేసిన తిప్ర మోతా పార్టీ గట్టి పోటీ ఇస్తుం డడంతో రాజకీయ సకరణాలు మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *