హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్8: మృగశిర కార్తె సందర్భంగా శుక్రవరాం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు వెల్లడించారు. చేప ప్రసాదం కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్టాల్ర నుంచి లక్షలాది మంది వస్తుంటారని చెప్పారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలకు వేరు వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి చేప ప్రసాదం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.



