నేటి సమాజంలో ఇంగ్లీష్ బాషాకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05:చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎర్రవెల్లి గ్రామంలో బృందావన వనంలోని ఆంగ్ల యజ్ఞం ఏ మిషన్ బై యాజ్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ నూతన బ్రాంచ్ని  ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూఆధునిక సమాజంలో ఆంగ్లభాష యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ప్రాముఖ్యత ఉంది అని యాదన్న అన్నారు.నేటి సమాజానికి కార్పోరేట్ సంస్థలకు అనుగుణంగా మారాలి అంటే మనకు కావలసిన ఆయుధం ఆంగ్లభాష అని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు.నేటి సమాజంలో ఇంగ్లీష్ భాషకు అధిక ప్రాముఖ్యత వ్వాలన్నారు.విద్యార్థులు పాఠాలు అర్థం చేసుకోవడానికి విద్య పూర్తయిన వారు ఉద్యోగాలు సంపాదించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు మానవుని మనుగడకు ఆంగ్లభాష ఎంతో అవసరం ఉందని అన్నారు.విదేశాలలో వున్న బంధువులతో స్నేహితులతో మాట్లాడడానికి వ్యాపారం నిర్వహించడానికి ఆంగ్లంపై అవగాహన అవసరం కచ్చితంగా ఉండాలని యాదన్న అన్నారు.మనిషి బ్రతకడానికి గాలి నీరు ఆహారం వస్త్రం ఎలా అవసరమో మనిషి ఎదగటానికి ఆంగ్లం అంతే అవసరం అని కాలే యాదన్న అన్నారు.అందరి ప్రయోజనం కోసం ఆంగ్ల యజ్ఞం ఏ మిషన్ బై యాజ్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థ వారు ప్రత్యేకమైన బోధన విధానాలతో ముందుకొచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య యాజమాన్య సంస్థకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *