ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ వారు కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ కోసం లయన్ ఇంటర్నేషనల్ ఏరియా లీడర్ ఎం డి 320 లయన్ జి చెన్న కిషన్ రెడ్డి అందించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్వకుర్తి లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ప్రశాంత్ నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. దామోదర్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఆచార్యులు కృష్ణమోహన్ కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చెన్నకిషన్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని సరస్వతి శిశు మందిరాలను సందర్శిస్తే సాంస్కృతి సాంప్రదాయానికి నిలువుటద్దాలుగా కనబడతాయని ఆయన అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి నీ పెంపొందింప చేసే వంటి కార్యక్రమాలు చేపట్టడం సరస్వతి పాఠశాలలకే సొంతమని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు కల్వకుర్తి ప్రశాంత్ నర్సింగ్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ విద్యతోపాటు నేటి సాంకేతిక నైపుణ్యతను విద్యార్థులకు నేర్పించేందుకు కోసం ఈ ల్యాబ్ లను బహుకరించడం జరిగిందన్నారు. కల్వకుర్తి శిశు మందిర్ కు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు. శిశుమందిరాలు హిందూ సాంప్రదాయ గౌరవ మర్యాదలకు నిలువుటద్దంగా నిలబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పి. వెంకట్ రెడ్డి, బైరి. కరుణాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా శిశుమందిర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు




