తిరుమల,నవంబర్30: తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్ దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు తెలిపారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.




