ఒక్కడివా? ఒంటరివా?
ఏకాంతంగానా? ఏకాకిగానా?
ఒక్కడివైతే పరవాలేదు!
ఎప్పటికో అప్పటికి
జోడీ దొరుకుతుంది!
ఒంటరి అయితేనే భయం
న్యూనత వరించి శూన్యం మిగులుతుందేమోనని!
రాకపోకల్లో ఒక్కడై
ఉండటం జీవిత ధర్మం!
ఆలోచనల్లో ఒంటరై
పోవటం బతుకు నాశనం!
ఏకాంతంగా ఉన్నావా?
పరవాలేదు!
శాంతి కలిగి సంతోషం విరుస్తుంది!
ఏకాకిగా మిగిలావా?
ఇబ్బందే!
అశాంతి మిగిలి ఆనందం హరిస్తుంది!
ఒక్కడిగా…
ఏకాంత జీవనం మంచిదే!
ఒంటరిగా…
ఏకాకి జీవితమే దుర్భరం!
అందుకే నువ్వు ఎవరో?
నువ్వే నిర్ణయించుకో!
నువ్వు ఎలా మిగిలావో?
నీకే అర్థం అవుతుంది!
– ఉషారం, 9553875577




