నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌ ‌కోర్టులో ఆగ్రహం

జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశం
పిటిషన్లను దిల్లీకి మార్చాలన్న అభ్యర్థన తోసివేత
పిటిషన్‌ ఉపసంహరించుకున్న నుపుర్‌ ‌శర్మ

న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలుచేసినందుకు దేశానికి క్షమాపణలుచెప్పాలని అంది. అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇతరమతాలపట్ల అసహనం చాటారని పేర్కొంది. అన్నిమతాలను గౌరవంగా చూడాలన్న ఇంగితం లేకపోఇడం సరికాదని పేర్కొంది. డియా ద్వారా నుపుర్‌ ‌శర్మ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. పార్టీ అధికార ప్రతినిధి అయినంత మాత్రానా ఏదిపడితే అది మాట్లాడతారా అని చురకలు అంటించింది.

ఆమె పిటిషన్లు బట్టి చూస్తే న్యాయమూర్తులను కూడా ఆమె చాలా తక్కువగా భావిస్తున్నట్లు తెలుస్తుందని సుప్రీం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లకు నుపుర్‌ ‌శర్మనే బాధ్యురాలంది. నపూర్‌ ‌శర్మ వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయని జస్టిస్‌ ‌సూర్య కాంత్‌ అభిప్రాయ పడ్డారు. ఉదయ్‌పూర్‌ ‌లాంటి ఘటనలు తెరపైకి వచ్చాయని అన్నారు. దేశవ్యాప్తంగా తన పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ దర్యాప్తు నిమిత్తం ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నుపుర్‌ ‌శర్మ సుప్రీమ్‌కోర్టులో పిటిషన్‌ ‌వేసింది తనకు నిత్యం ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ శర్మ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనితో నుపుర్‌ ‌శర్మ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *