- పరీక్షకున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి
- పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల పిటిషన్‌పై సుప్రీమ్ కోర్టులో విచారణ
- లీక్ ఆరోపణలపై సమాధానమివ్యాలని ఎన్టిఏకు నోటీసు..
- అడ్మిషన్ల ప్రక్రియపై స్టేకు నిరాకరణ
- విచారణ జూన్ 8కి వాయిదా
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 11 : నీట్-యుజి 2024 ప్రశ్నాపత్రాల లీక్ ఆరోపణలపై పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీమ్‌కోర్టు మంగళవారం కేంద్రం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్ మరియు అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం పరీక్ష పవిత్రతపై ప్రభావపడందని, తమకు సమాధానం కావాలని అన్నారు. అయితే, పరీక్షలో ఉత్తీర్ణులైన వారి ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ పక్రియపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కౌన్సెలింగ్ ప్రారంభించుకోవచ్చని, తాము ఆపడం లేదని సీనియర్ న్యాయవాది మాథ్యూస్ జె నెదుంపర కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోర్టును కోరిన సందర్భంగా జస్టిస్ నాథ్ అన్నారు. తాజాగా దాఖలైన రిట్ పిటిషన్లో, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 5 న జరిగిన నీట్-యూజి 2024 పరీక్ష పవిత్రతపై విద్యార్థుల బ్యాచ్ పలు సందేహాలు లేవనెత్తింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల సందర్భంగా పరీక్ష రద్దు అంత సులభం కాదని, పరీక్షకున్న పవిత్రత దెబ్బతింటుందని వ్యాఖ్యానిసూ, అందుకే దీనిపై తమకు సమాధానాలు కావాలని జస్టిస్ అమానుల్లా ఎన్టిఏను ఆదేశించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై ఇప్పటికే విచారణ జరుపుతుందని, జూలై 8న దానిని విచారించాల్సి ఉందని, ప్రస్తుత పిటిషన్‌ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారణకు ట్యాగ్ చేసిందని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 5న జరిగిన పరీక్ష పవిత్రతపై సందేహాలు లేవనెత్తుతూ కొందరు విద్యార్థుల సమూహం దాఖలు చేసిన తాజా రిట్ పిటిషన్లో నీట్-యూజీ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహింఎన్టిఏను ఆదేశించాలని కోర్టును కోరారు. కాగా మే 17న ఇదే తరహా పిటిషన్‌ను విచారించిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నీట్ పరీక్ష ఫలితాల ప్రకటనపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జూలై 8న విచారణకు వాయిదా వేసింది.



