నీట మునిగిన నందన్ రతన్ ప్రైడ్ కాలనీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జూలై 31: గత మూడు సంవత్సరాలుగా పటాన్ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో చిన్నపాటి వర్షానికి చెరువులు పొంగి ఇల్లు అన్ని నీట మునుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి ఆరోపించారు. సోమవారం గోదావరి అంజిరెడ్డి నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాలనీవాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ… ఇక్కడ చిన్నపాటి వర్షానికి ఇండ్లని మునిగి ఉన్నాయని, అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. అదేవిధంగా డెవలపర్ కి పక్కన చెరువు ఉండగా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని, డెవలపర్ కూడా డ్రైనేజ్ వాటర్ కు పరిష్కారం చూపించకుండా ఇల్లులన్నీ అమ్ముకొని వెళ్లడం జరిగిందని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా గత మూడు సంవత్సరాలుగా వరద నీరు చేరుతున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొందరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, బీజేపీ నాయకులు జైపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, యాదిరెడ్డి, మల్లేష్, మహిళా నాయకురాలు పూర్ణిమ, బసవమ్మ, గీత, కాలనీవాసులు మిశ్రా, సత్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *