ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : నిరుపేదలకు సేవలు అందించడమే ఆమనగల్ లయన్స్ క్లబ్ లక్ష్యం అని శ్రీ లక్ష్మీ ఫైనాన్స్ మేనేజర్, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జూలూరి జయప్రకాష్, జూలూరి రమేష్ సెట్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్రం లో మల్టిపుల్ 320 లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని కీర్తిశేషులు జూలూరి శంకరయ్య 13వ వర్ధంతి సందర్భంగా ఆమనగల్లు బస్టాండ్ ఆవరణలో ఆయన కుమారులు జూలూరి జయప్రకాష్, జూలూరి రమేష్, జూలూరి అశోక్, జూలూరి గోపాల్, జూలూరి సురేష్ లు సమకూర్చిన అన్నదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ జూలూరి రమేష్ ప్రారంభించారు. ఆకలితో ఉన్నవారిని ఆకలి తీర్చడం కోసం నిరుపేదలకు సేవలు అందించడం లయన్స్ క్లబ్ లక్ష్యమని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి మెగా వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలను సహకరిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులను రమేష్ అభినందించారు. కీర్తిశేషులు జూలూరి శంకరయ్య సేవలను లయన్స్ క్లబ్ సభ్యులు కొనియాడారు. ఈ అన్నదాన శిబిరంలో 450 మందికి అన్నదానం చేసినట్లు లయన్స్ క్లబ్ పిఆర్ఓ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ రీజనల్ చైర్మన్ ఏం చంద్రశేఖర్, ఫాస్ట్ జోన్ చైర్మన్ కె. రామ్ రెడ్డి, జిల్లా చైర్మన్ బి. యాదయ్య, సంయుక్త కార్యదర్శి ఎంగలి బాలకృష్ణ, కోశాధికారి కొరివి వెంకటయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు ఏలే. శివకుమార్, కర్నాటి. కొండల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మదన్ గౌడ్, టి. రామ్ రెడ్డి, లయన్ సునీత, క్లబ్ పిఆర్ఓ పాషా, పాండు రెడ్డి, మరియు లయన్స్ క్లబ్ సభ్యులు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు సేవలు అందించడమే లయన్స్ క్లబ్ లక్ష్యం



