ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 : ఆమనగల్లు మండలం రాం నుంతల గ్రామ పంచాయితి చిన్న తండా కి చెందిన పాత్లావత్ రమేష్ అనే విద్యార్థి పై చదువులు విదేశాలకు (జర్మనీ) వెళ్లేందుకు కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి విద్యార్థి కుటుంబ సభ్యులకు రూ.50, వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి చేయూతనందించారు. విద్యా ఉపాధి వైద్యమే లక్ష్యంగా తానెప్పుడూ సహాయం చేసేందుకు ముందుంటానని చెప్పారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల చదువులకి అడ్డు కాకూడదు అనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ సహాయ సహకారాలు అందిస్తున్నానని తెలిపారు. నియోజక వర్గంలో ప్రతి పేద విద్యార్ధికి అండగా ఉంటానని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. ఈ కార్య్రమంలోబ్లాక్ కాంగ్రెస్ నాయకులు రచ్చ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.




