ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6 : నిరుద్యోగ యువతీ యువకులు తల్లిదండ్రులకు భారం కాకుండా స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకొని రాణించాలని బిజెపి జిల్లా నాయకుడు వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ ప్రకాష్ వెలుగు రాళ్ల తండకు చెందిన ఇస్లావత్ రఘులు కలిసి మామా బ్రో బట్టల దుకాణం పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాందాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివిధ రంగాల్లో రాణించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హిరాసింగ్ నాయక్, శ్రీను, వినోద్, కళ్యాణ్, ప్రవీణ్, విజయ్, సర్దార్, బాబూలాల్, కిరణ్, చిన్న యువకులు పాల్గొన్నారు.




