ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఆమనగల్ తహసిల్దార్ కు బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 3016/- లను నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని ప్రలోబాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తున్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ లలితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వగ్గు ప్రభాకర్, కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ మీడియా ఇంచార్జ్ రవి రాథోడ్, ఆమనగల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బీజేవైఎం రాజు గౌడ్, మున్సిపాలిటీ దళిత మోర్చా అధ్యక్షులు గోరటి యాదగిరి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కార్యదర్శులు యాదగిరి, బాలు, మహేష్, ఉమేష్, బీజేవైఎం గ్రామ అధ్యక్షులు శ్రీకాంత్, నిరంజన్, మహేష్, మల్లేష్, శివ, నరసింహ, రాజు, మల్లేష్ యాదవ్, యాదగిరి, అంజి, సాయి, ప్రభాస్, సతీష్ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.


