ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. శనివారంకుషాయిగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నీ బండారి లక్ష్మారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.


