ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజల కోసం, ఉప్పల్ ప్రగతి కోసం పాటుపడే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్లో మరో సారి అవకాశం ఇచ్చి
ఆశీర్వదించి కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్. కె.లక్ష్మణ్ ప్రజలను అభ్యర్థించారు.
అవకాశవాద నాయకులు, అమలు కాని హామీలతో, పదవుల కోసం ప్రగల్బాలు పలికే రాజకీయ నాయకులను నమ్మొద్దని,
రేపటి ఉప్పల్ భవిష్యత్తు మీ ఓటుతో ముడిపడి ఉందని ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు.బుధవారం రాత్రి మేకల భారతి గార్డెన్ నుండి సూర్య నగర్ కాలనీ, సరస్వతి కాలనీ, హనుమాన్ సాయి నగర్, విజయపురి కాలనీ, సత్యా నగర్, శాంతినగర్ మీదగా వెంకటేశ్వర స్వామి కమాన్ వరకు రాజ్యసభ సభ్యులు డాక్టర్. కె.లక్ష్మణ్ తో కలిసి ఉప్పల్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ లో ఆగిపోయిన అభివృద్ధి మీ కళ్లముందుకు ఉప్పల్ ను సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి, హైదరాబాదు కే ప్రతిష్ఠాత్మకమైన ఉప్పల్ కారిడార్ సాధించానన్నారు. ఉప్పల్ లో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడు దశాబ్దాలౌతోందనీ నేను ఎమ్మెల్యే అయిన మరు క్షణం కేంద్రం నుంచి నిధులు తెచ్చి నూతన డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాననీ ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో ఉప్పల్ నియోజకవర్గంలో తాగు నీటి కొరత వుండేదనీ అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తో మాట్లాడి రూ. 450 కోట్లు తెచ్చి,12 రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి ఘనత బిజెపి పార్టీకే దక్కిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దళితలకు మూడెకరాల భూమి ఇస్తామన్నదీ మోసం కాదా, అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నది మోసం కాదా , ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చాయా? అని ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసి బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ ప్రజల ఓట్లు వేయించుకొని ఏం చేశారని ప్రభాకర్ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ లో ఫెయిల్ అయిన బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాలని కోరారు. ప్రజల కోసం పని చేసే నన్ను ఆదరించి గెలిపించండని ప్రభాకర్ ప్రజలను కోరారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు డాక్టర్. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రభాకర్ కు అవకాశం ఇస్తే ఎంత అభివృద్ధి చేశాడో మీరు చూశారన్నారు. నియోజకవర్గం మొత్తం మంచినీటి సమస్య లేకుండా , ఉప్పల్ కారిడార్ , చర్లపల్లి రైల్వే స్టేషను అభివృద్ధి , ఉప్పల్ కారిడార్ వల్ల ఉప్పల్ వాసులు నష్టపోకుండా తగిన పరిహారం అందేలా చేశాడనీ తెలిపారు. కరోనా సమయంలో ప్రభాకర్ ఎంతో మంది ప్రాణాలు కాపాడాడనీ, తెలంగాణ లో అవినీతి, అసమర్థ ప్రభుత్వం పోవాలి. కరోనా కాలంలో బిజేపి నాయకులు కార్యకర్తలు ప్రజలకు ఎనలేని సేవ చేశారనీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయకుండా పేదల ఉసురుపోసుకున్న కేసిఆర్ ను గద్దె దించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెస్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు మేలు చేసే కార్యక్రమం చేశారన్నారు. బిజేపి కార్యకర్తలు ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు అండగా నిలిచారనీ, ఉప్పల్ లో ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వాళ్లు అక్రమ సంపాదనకు దాచుకునేందుకు, మరింత దోచుకునేందుకు వస్తున్నారనీ, ప్రజలు తస్మాత్ జాగ్రత్త అన్నారు. ముప్పై ఏళ్ల రాజకీయం లో ఒక్క అవినీతి మరక లేని ప్రభాకర్ ను గెలిపించండ అని మీ కోసం పని చేస్తాడనీ తెలిపారు. ఉప్పల్ అభివృద్ధి , తెలంగాణ లో బిజేపి అధికారంలోకి రావాలనీ, ఉప్పల్ లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గెలవాలని లక్ష్మణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు, హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్, సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్, గొంగులూరి శ్రీనివాస్ శర్మ, రావుల బాలకృష్ణ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సతీష్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకటరావు, రేవెల్ల రాజు, కొల్లు బాలరాజు, గోనె శ్రీకాంత్ ,వల్లపు జగన్ యాదవ్, ముదిరాజ్, శ్రీధర్ గుప్తా, డాక్టర్ శిల్పారెడ్డి, ఆదిలక్ష్మి పిఆర్పి నాయకురాలు నిరుపమ, అధిక సంఖ్యలో బిజెపి,పిఆర్పి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.




