‌నికు ఎలాంటి అమ్మాయి కావాలి…

  • నానమ్మ, అమ్మ లక్షణాలున్న వారిని ఇష్టపడతా
  • విలేఖరి ప్రశ్నకు రాహుల్‌ ‌గాంధీ ఆసక్తికర సమాధానం
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర రెండోరోజు దిల్లీలో కొనసాగుతున్నది. పెండ్లిపై ఒకరు ప్రశ్నించగా.. ఆయన సమాధానం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఎప్పటిమాదిరిగానే నవ్వుతూ సమాధానమిచ్చారు. నానమ్మ ఇందిరా గాంధీ, అమ్మ సోనియా గాంధీల లక్షణాలు ఉన్న అమ్మాయిలను ఇష్టపడతానని తన మనసులో మాట వెల్లడించారు. ఇందిరగాంధీ అంటే తనకు ప్రాణమని, తనకు రెండో తల్లిలాంటిదన్నారు.
ఈ సమయంలో రిపోర్టర్‌ ‌కల్పించుకుని  నానమ్మ వంటి లక్షణాలున్న మహిళను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. దాంతో చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగావంటూ రిపోర్టర్‌కు కితాబిచ్చాడు. నానమ్మ, అమ్మ.. ఇద్దరి లక్షణాలున్న మహిళల్ని తాను ఇష్టపడతానని చెప్పారు. భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా యూట్యూబ్‌ ‌ఛానల్‌ ‌మాషబుల్‌ ఇం‌డియా బాంబే జర్రీపై స్పెషల్‌ ఎపిసోడ్‌ ‌నిర్మించింది. ఈ కార్యక్రమంలో అభిమానులు, సాధారణ ప్రజలు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ ‌తనదైన శైలిలో సమాధానమిచ్చి ఆకట్టుకున్నారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. మిమ్మల్ని కొందరు పప్పు అని పిలుస్తుంటే బాధేస్తుందా? అని అడగ్గా.. అలాంటిదే లేదన్నారు.
ఇదంతా రాజకీయంలో భాగంగానే తనను అంటుంటారని తేలిగ్గా తీసుకున్నారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, అమ్మ తనకు అన్ని విషయాల్లో మార్గదర్శిగా ఉంటారని స్పష్టం చేశారు. కార్లంటే ఇష్టమా అని ప్రశ్నించగా.. నిజానికి తనకు ఒక్క కారు కూడా లేదని చెప్పారు. ఎటైనా వెళ్లినప్పుడు అమ్మ కారును వాడుతానన్నారు. నాకు డ్రైవింగ్‌ అం‌టే ఇష్టమే.. అంతకన్నా నడవడం అంటే మరీ ఇష్టమని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *