నారసింహుడిని దర్శించుకున్న హరీష్‌ ‌రావు దంపతులు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీష్‌ ‌యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *