నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టర్ సూచనలు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 02: సాధారణ ఎన్నికలో భాగంగా నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భారతి హోలికేరి సూచించారు. గురువారం మహేశ్వరం తహసీల్దార్కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం సందర్శించి మాట్లాడారు. నవంబరు 3 నుంచి నామినేషన్ల స్వీకరణకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సూరజకుమార్, సీఐ మునికిసూచనలు చేశారు. కార్యాలయంలో అకౌంటింగ్ టీమ్, వివిటిసీ, విజల్, హెల్ప్ డెస్క్లను పరిశీలించారు. నామినేషన్ సమయం రికార్డ్ చేయాలని తెలిపారు. నామినేషన్ సందర్భంగా 100 మీటర్ల పరిధి మార్కింగ్ చేసి నామినేషన్ వేసేందుకు అభ్యర్థి, ప్రతిపాదకులు, వాహనాలను ఎన్నికల నిబంధనల మేరకు అనుమతించాలన్నారు. ఆర్వోసూరజ్ కుమార్ తోపాటు డిటి శేఖర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *