నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరెడ్డి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 6 : కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశిచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఆమనగల్లు ఎంపిపి అనితా విజయ్ నాయక్‌, కాంగ్రెస్ పార్టీ నాయకులు బృంగి ఆనంద్ కుమార్‌ లతో కలిసి కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *