నామినేషన్ ఉపసంహరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ స్వతంత్ర  ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కానుగుల జంగయ్య బుధవారం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వస్ఫుల జంగయ్య, కానుగుల జంగయ్యతో మాట్లాడి ఒప్పించి నామినేషన్ ను ఉపసంహరించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా జంగయ్య నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య విలేకరులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *