- మంచి పనులు చేయడానికి అధికారంలో ఉండాలి
- నేనూ ఒకప్పుడు రాజకీయ నాయకురాలినే..నేడు గవర్నర్ని
- గవర్నర్గా వొచ్చినప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో ఒక్క మహిళా మంత్రి లేరు
- రాజ్ భవన్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కృతజ్ఞత సభలో గవర్నర్ తమిళి సై
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : లోక్ సభ, శాసన సభల్లో మహిళలలకు 33 శాతం రిజర్వేషన్ చట్టం తెచ్చినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ధన్యవాదాలు తెలిపారు. 27 సంవత్సరాలుగా ఈ బిల్లుపై చర్చలు జరుగుతున్నా కానీ అమలుకు నోచుకోలేదని, కానీ నేడు అమలుకు నోచుకోడమే కాకుండా ఒక మహిళా రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్భవన్లో గవర్నర్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ…తనపై పువ్వులు వేసేవారు, అలాగే రాళ్లు వేసే వారూ ఉన్నారని వ్యాఖానించారు. అందరూ అందరికి నచ్చాలని లేదని గవర్నర్ అన్నారు. అయితే తనపై రాళ్లు విసిరితే వాటితో తాను ఇల్లు కట్టుకుంటానని, ఒకవేళ పిన్స్ వేస్తే ఆ పిన్స్ గుచ్చుకుని ఆ రక్తంతో తన చరిత్రతో ఒక పుస్తకం రాస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మంచి పనులు చేయడానికి అధికారంలో ఉండాలని, ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయాలలకు ప్రతి ఒక్కరూ ఒక కలతోనే వొస్తారని, అయితే పురుషులతో పోలిస్తే తాము 20శాతం ఎక్కువ పని చేస్తే కాని తగిన గుర్తింపు లభించదని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు తానూ బిజెపి నేతనేనైనా నేడు గవర్నర్నని పేర్కొన్నారు. అప్పట్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, తాంతో ఎంతో మంది హహిళలు బిజెపి పార్టీలో చేరరారని తెలిపారు. తాను కూడా రాజకీయాలపై మక్కువతోనే ఎంతగానో ఇష్టపడే వైద్య వృత్తిని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వొచ్చానని తమిళి సై స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువని గవర్నర్ అన్నారు. భారత్లో 15 లక్షల పంచాయతీలకు హహిళలు ప్రెసిడెంట్లుగా ఉన్నారని అన్నారు. తాను పురుషులకంటే మెరుగ్గా పని చేస్తున్నాని, ఇకపై రాజకీయాల్లో మహిళల పవర్ కనిపిస్తుందని గవర్నర్ అన్నారు. ఇక తాను గవర్నర్గా రాష్ట్రానికి వొచ్చినప్పుడు మంత్రి మండలిలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని, పదవి చేపట్టిన రోసు సాయంత్రమే ఇద్దరు మహిళల చేత ప్రమాణ స్వీకారం చేయించానని తమిళి సై తెలిపారు. తనకు ప్రోటోకాల్ ఇచ్చినా..ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతానని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు.




